సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే.

Leave a comment