Categories
ఎండతో ఎఫెక్టయ్యేది ముఖ చర్మం. కళ్ళజోడు వాడినా క్యాప్ పెట్టుకున్నా ఎండ తాకిడికి మొహం కందిపోయి పొడిబారి పోతుంది. కమిలిన చర్మానికి అలోవేరా గుజ్జు అద్భుతమైన ఉపశమనం. అలాగే బొప్పాయి గుజ్జు కుడా. ఈ రెండు రకాల గుజ్జులు చర్మాన్ని యధాస్థితికి తెస్తాయి. ఎండలో నుంచి బయటకు రాగానే దోస రసం, పుచ్చకాయ రసం కలిపి ఆ నీటిలో దూది తడిపి మొహనికి , మెడకు రాసి కాసేపు ఆగి కడిగేయాలి. పాలలో దూది ముంచి మొహం తుడిచిన మలినాలు పోయి చర్మం మృదువుగా అవుతుంది. మాయిశ్చరయిజర్ కూడా మంచిదే ఎస్ పీ ఎఫ్ 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్ రాసుకుంటే ఎండకు చర్మం కమిలిపోకుండా ఉంటుంది.