ఉదయం అల్పహారానికి ప్రాముఖ్యత ఇవ్వండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. టిఫిన్ మానేస్తే బరువు తగ్గరు పైగా మధ్యాహ్నం ఆహారం ఎక్కువగా తీసుకొనే ప్రమాదం అంటుంది. కనీసం ఒక్క శాండ్ విచ్ అయినా తినాలి. రాత్రి భోజనం తర్వాత నిద్ర పోయాక ,ఉదయం వరకు పొట్ట ఎనిమిది గంటల పాటు ఖాళీగా ఉంటుంది అందుకే ఉదయం టిఫిన్ తినాలి. అల్పహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. విపరీతమైన నీరసం వస్తుంది. శరీరానికి కావాలసిన శక్తి దోరుకనప్పుడు మెదడు కూడా మాట వినటం మానేస్తుంది. అందుచేత ఎంత జరూర్ పనులున్న తప్పని సరిగా మార్నింగ్ టిఫిన్ తిని తీరాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment