దేహంలో ఉండే అవయవాల్లో అతి ముఖ్యమైన కళ్లు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. కళ్ళకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. పడుకునే ముందర రోజ్ వాటర్ లో కాటన్ ముంచి కళ్ళ చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము ధూళి పోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి కనుబొమ్మలకు కనురెప్పలకు రాత్రివేళ ఆముదం రాసి తెల్లవారి కడిగేస్తే ఒత్తుగా అయిపోతాయి. కళ్ళ చుట్టూ తేనెతో మసాజ్ చేస్తే కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోతాయి. పచ్చిపాలలో  కాటన్ ముంచి కళ్ళ చుట్టు సుతిమెత్తగా మర్దనా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు తగ్గిపోతాయి రోజ్ వాటర్ మిశ్రమం, టమాటో,నిమ్మరసం, మిశ్రమం కూడా కళ్లకు మసాజ్ చేస్తే అలసట తగ్గిపోతుంది.

Leave a comment