పౌలోమి బసు తీసిన మాయ ది బర్త్ ఆఫ్ సూపర్ హీరో అనే వర్చువల్ రియాలిటీ సినిమా అంతర్జాతీయ వేదిక కేన్స్ పైన అందరి ప్రశంసలు అందుకుంది. నేపాల్ లో చౌపది ఆచారం పోలో పౌలోమి బసు ను కదిలించింది. నెలసరి సమయంలో స్త్రీలు ఇంటికి రాకుండా ఊరి చివర గుడిసెల్లో ఉండటం వాళ్లకు ఎన్నో ఇన్ఫెక్షన్స్ రావడం పాముకాటుతో చనిపోవడం చూశాక ఆ ఆచారంపై పోరాటం చేసింది పౌలోమి బసు. ఆ ప్రాజెక్టు కు బ్లడ్ టాక్స్ అని పేరు పెట్టింది. ఆమె తీసిన వీడియోలు ఫోటోలు నేపాల్ ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆ ఆచారాన్ని నిషేధించింది ప్రభుత్వం టు బి ఎ గర్ల్, మై బాడీ ఈజ్ మైన్ పేరుతో ఆమె చేసిన ప్రచారానికి తగిన ఫలితం దక్కింది.

Leave a comment