టైమ్స్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితాలో వందమంది మోస్ట్ ఇన్ ఫ్లుయిన్షియిల్  పీపుల్ లో ఒకరిగా చోటుచేసుకున్నది ఇరాక్ లో జన్మించిన హోడా ఖామోష్ చిన్నతనంలోనే కుటుంబంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు వచ్చారామే . జర్నలిజం లో శిక్షణ పొందిన ఖామోష్ స్థానిక పత్రిక లో పనిచేస్తూ స్త్రీల హక్కుల ఉద్యమాలపై ప్రత్యేక కథనాలు రాసింది. రేడియో  ప్రజెంటేటర్ గా తన గొంతు వినిపించింది. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలన మొదలైన తర్వాత స్త్రీలపై జరుగుతున్న అనిచివేత గురించి నార్వే సదస్సులో గొంతు విప్పింది. నేను తప్పు చేయటం లేదు తప్పుల గురించి మాట్లాడబోతున్నాను అంటూ నార్వే సదస్సులో మాట్లాడిన ఖామోష్ ను ఆఫ్గనిస్తాన్ అగ్ని తేజం గా పిలుస్తున్నారు.

Leave a comment