చిత్రకారిణిగా, వ్యాపారవేత్తగా మానవతావాదిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే జ్యోతి అధవ్. 2022 సంవత్సరానికి గాను టైమ్స్ అప్ లోడ్స్ ట్రెండ్ సెట్టర్ గా అవార్డు అందుకున్నారు. పూనే కు చెందిన జ్యోతి క్రియేటివ్ ఆర్టిస్టే కాక గొప్ప వ్యాపార వేత్త నైరూప్య చిత్రకారిణి జ్యో ఆర్ట్స్ అండ్ డేకార్స్ వ్యవస్థాపక డైరెక్టర్ పూణే కేంద్రంగా నడిచే మసాలా కంపెనీ సాఫ్రో కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వసుమతి వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఆసరా కోల్పోయిన వారు నిరుపేదలకు సాయం చేస్తారు. చిత్రకళా నైపుణ్యంతో ఆర్ట్ స్టూడియో నిర్వహిస్తూ ప్రత్యేకమైన డెకరేటింగ్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎంతోమంది ప్రేరణగా నిల్చి నందుకుగాను ఆమె టైమ్స్ ఆఫ్ లోడ్స్ ట్రెండ్ సెట్టర్ అవార్డ్ వరించింది.

Leave a comment