Categories
బీహార్ లో తొలి మహిళా ఐ పి ఎస్ గా కొత్త అధ్యాయం ప్రారంభించిన మంజరి జరుహార్. తన ఆత్మ కథను “మేడమ్ సర్” పేరుతో అక్షర బద్దం చేశారు. వృత్తి జీవితం గురించే కాదు, మహిళలు సమాజం నుంచి ఎదుర్కొనే వివక్ష గురించి చెప్పేందుకే ఈ పుస్తకం రాశాను అంటారు మంజరి. 2010 లో సి ఐ ఎస్ ఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా రైటర్ అయ్యారు. ప్రెసిడెంట్ మెడల్ తో సహా ఎన్నో గౌరవాలు అందుకున్నారు మంజరి. ఫీల్డ్ లో కూడా మంజరి ని మేడమ్ సర్ అని పిలిచేవారట. ఆ స్ఫూర్తితో పుస్తకానికి ఆ పేరు పెట్టారు మంజరి.