కొత్తతరం తల్లిదండ్రులు కొత్త ఆలోచనలూ  రావాలి . పిల్లల్ని అంటిపెట్టుకొని కుదరదు . ఎన్నిపనులుంటాయి . అందుకే ఓ ఏడాది వయసున్న బాబు తల్లి పిల్లాడిని మరిపించే ఒక చక్కని ఉపాయం కనిపెట్టింది . ఈ జపాన్ మహిళ తన పెద్ద కటౌట్స్  తయారు చేయించుకొని అన్ని గదుల్లో పెట్టింది . ఆమె పక్కనే ఉందనుకొన్న బాబు నవ్వుకుంటూ ఆడుకోవటం మొదలు పెట్టిన ఫొటోస్ ట్విటర్ లో పెడితే క్షణాల్లో వైరల్ గా మారింది. మరీ పిల్లాడు ఎదురుగా కూర్చుంటే మిగతా పనులు చేసుకోవాలి కదా ! ఈ తల్లి ఆలోచనలు నెటిజనులు ఎంతో మెచ్చుకొని ఇదో కొత్త పేరెంటింగ్ టెక్నీక్ అని కితాబు ఇచ్చారు.

Leave a comment