నీహారికా ,
నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకున్నా ఏదోరకంగా నాకు తెలియటం మంచిదే అయింది. ఇది నీ ఒక్కదాన్ని సమస్యే కాదు. టీనేజర్లు అందరిదీ. నేను తప్పకుండా మీ అమ్మతో మాట్లాడతాను. నీ సమస్య డాక్టర్ తో సంప్రదించాలి. నీ శరీరం గురించి నీకు అర్ధమయ్యేలా చెప్పగలిగేది డాక్టరే. టీనేజ్ అనేది బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగిడే సమయం. ఈ కాలంలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వ్యక్తిగత శుభ్రత లేదా వాటిని సంబంధించి ఏ విషయం అయినా పిల్లలు తల్లితండ్రులతో కూడా చర్చించరు. అలాగే తల్లితండ్రులు ఎదుగుతున్న పిల్లలకు ఎన్నో విషయాలు చెప్పటం ఇబ్బందిగా ఉండచ్చు. న్యాయంగా వాళ్లే పిల్లలకు అన్ని విషయాలు చెప్పాలనుకో పోనీ. ఆలా నెపం వేయటం ఎందుకు. పిల్లని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకుపోతే వాళ్ళ సందేహాలు డాక్టర్ తో చెప్పుకోగలుగుతారు. అలాగే నీకు హెచ్చరిక . ఎదిగే వయసులో శరీరం లో వచ్చే మార్పులు గానీ నీ స్నేహితుల గురించి గానీ నీకు ఎదురయ్యే ఇబ్బందులు కొత్తగా అడుగుపెడుతున్న ప్రపంచంలో నువ్వు అర్ధం చేసుకోలేని విషయాలు నీకు కష్టం కలిగించే అంశాలు ఒకవేళ నీ చదువులో నీకు ఎదురయ్యే సమస్యలు పెద్దవాళ్ళు అమ్మ నాన్న లతో మొహమాటం లేకుండా చర్చించు. వాళ్ళు నీకు స్నేహితులు కంటే ఎక్కువ. నీ బాగోగులు వాళ్ళకే తెలుస్తాయి. నువ్వు పెరిగి పెద్దయి జీవితంలో తల్లి తండ్రి చెప్పే విలువైన సలహాలు విను. మీ మధ్య దాపరికలుంటేనే ప్రమాదం తెలుసా !!