Categories

మగవాళ్ళు ఎవరైనా అబద్దాలు ఆడితే ఒక్క నిముషంలో ఆడవాళ్ళు ఆ విషయాన్ని కని పెట్టేయగలరట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. ఎందరో విభిన్న సంస్కృతుల్లో ఉండే స్త్రీ పురుషులతో ఈ పరిశోధన చేశారట. అబ్బాయిల అబద్దాలు వాళ్ళ కళ్ళే సులువుగా చెప్పెస్తాయట. కళ్ళల్లోకి చూస్తే చాలు అమ్మాయిలు ఈవిషయం ,చెప్పేస్తారట. తమషా ఏమిటంటే అమ్మాయిలు అబద్దాలు ఆడితే అమ్మాయిలే కాదు ఆమెతోటి అమ్మాయిలు కూడా దాన్ని పసిగట్ట లేరట. వాళ్ళు చక్కని కళ్ళున్న సరే ఆ కళ్ళలో మనసు కనిపించకుండా దాచేయగలరని పరిశోధకులు కూడా చేతులెత్తేశారు.