మానసిక విశ్రాంతిని ఇచ్చే డార్క్ చాక్లెట్ సౌందర్య పోషణకు ఉపకరిస్తుంది.డార్క్ చాక్లెట్ ను కరిగించి ఇందులో ఒక స్పూను తేనె కొద్దిగా రోజు వాటర్, కలబంద గుజ్జు కలిపి ముఖానికి మాస్క్ గా వేసుకోవాలి. ఆరిపోయాక కడిగేసుకోవచ్చు. ఇలా తరచూ చేస్తుంటే చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చూస్తాయి. వీటిలోనే బి,ఇ,కె విటమిన్లు ఖనిజాలు చర్మానికి పోషణ ఇస్తాయి.ముఖంపై ముడతలు రాకుండా కరిగించిన చాక్లెట్లు ఒక స్పూన్ పాలపొడి రెండు స్పూన్ల నిమ్మరసం కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం,మెడ,చేతులకు అప్లై చేసి ఆరిపోయాక కడిగేసుకోవాలి.

Leave a comment