పిల్లలు పెరిగే వరకు తల్లికి కొత్తకొత్త విషయాలు నేర్చుకునే అవసరం వస్తుంది. పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాల మరకలు చక్కని డ్రెస్ పైన మరకలుగా పడతాయి. కాసేపటికి ఒకలాంటి వాసన వస్తుంది. గోరు వెచ్చని నీళ్ళలో కాసేపు నాననిచ్చి స్టెయిన్ రిమూవర్ వాడి వాష్ చేస్తే మరకలు,వాసన పోతాయి. అలాగే బేబీ అయిల్ క్రీమ్ మొదలైన మరకలు పాపాయికి స్నానం చేయిస్తుంటేనో ఎత్తుకుంటేనో బట్టలమీద కనిపిస్తాయి. ఈ మరకల పై నూనె పీల్చుకునేందుకు టాల్కామ్ పౌడర్ చల్లి పదినిమిషాల తర్వాత స్పూన్ తో స్క్రబ్ చేయాలి. ఆ తరువాత స్టెయిన్ రిమూవర్ తో ఉతకాలి బేబీ ఫుడ్ మరకలు లైట్ వెనిగర్ నీళ్ళు సమపాళ్ళలో తీసుకుని వాష్ చేస్తే పోతాయి.

Leave a comment