Categories
అందమైన ప్రదేశం చూడాలి అనుకుంటే జైపూర్ చూడాలి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రసిద్ధి. పర్యాటక ప్రదేశంగా ప్రఖ్యాతి చెందింది మూడు వందల ఏళ్ల నాటి చరిత్రను చూస్తే పశ్చిమ భారత ఎడారి రాష్ట్రం రాజస్థాన్ రాజు సవాయ్ జైసింగ్ కాలంలో పూర్తిగా రూపాంతరం చెందింది. ఆర్కిటెక్టర్ ను అధ్యయనం చేసి వాస్తుశాస్త్ర సూత్రాలతో 1727 లో రాజధాని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లకు పూర్తిచేశారు. జైపూర్ భారతదేశంలో తొలి ప్లాన్డ్ సిటీ 1826లో యువరాజ్ వేల్స్ పర్యటన కోసం జైపూర్ కు గులాబిరంగు ని పెయింట్ చేశారు. అలా అది పింక్ సిటీ అయింది. అద్భుతమైన నిర్మాణాలతో జైపూర్ పర్యటన ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.