Categories
బాడీ స్క్రబ్ గా ఫేస్ మాస్క్ లా ఓట్స్ చాలా బాగా పని చేస్తాయి. ఒక గిన్నెలో ఓట్స్ ,చక్కెర ,పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని బాగా ఆరిపోయాక స్నానం చేసేస్తే చాలు. పెరుగు మాయిశ్చరైజర్ గా చక్కెర ,ఓట్స్ మృతకణాలు నిర్ములించేందుకు పనికి వస్తాయి. యోగర్ట్ లో ఓట్స్,తేనే కలిపి ఆ మిశ్రమంలో ఫేస్ మాస్క్ వేసుకొంటే చాలు .ముఖం చక్కగా మెరిసి పోతుంది. అలాగే ఓట్స్ ,తేనె,పాలు ఆలీవ్ నూనె కలపి దీన్ని మొహాంపై మసాజ్ చేసినట్లు వలయాకారంలో రాసి ,పదినిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే సరిపోతుంది. ఓట్స్ ,రోజ్ వాటర్ ,లావెండర్ నూనె ,లెమన్ గ్రాస్ కలిపి ఆ మిశ్రమం నీళ్ళలో వేసి స్నానం చేస్తే చర్మం మెరిసి పోతుంది. ఓట్స్ తో చర్మానికి నిగారింపు వస్తుంది.