
ప్రకృతి చాలా విచిత్రాలు సృష్టిస్తోంది. అచ్ఛం గులాబీల్లా లేదా ఇంకాస్త అందంగా కనిపించే పులున్నాయి. వీటిని మన పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అవన్నీ ఓ తేయాకు మొక్కకి పూసే పువ్వులు. పట్టు రేకు లని తీర్చిదిద్దినట్లు కనిపించే పువ్వు కెమీలియా జపోనికా రకం. ఇక తేయాకు మొక్కగా కంటే పూల మొక్కగానే అభిమానిస్తారు. అలాగే రోజెస్ ఆఫ్ వింటర్. ఇదే తెలుపు ఎరుపు పసుపు వంగ పూవు రంగుల్లో వుండే తేయాకు మొక్క జపోనికా రకమే. ఇంత అందమైన పూల చెట్టు పూలను వంటల్లో వాడతారు. గింజలతో చేసే నూనె సౌందర్య సాధనాల తయారీలో వాడతారు. ఆకుల నుంచి ఎంతో రుచికరమైన టీ పొడి తయారవుతోంది. భారత అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో దీన్ని వ్యాపార పంటగా భావిస్తారు. ఇంత అందమైన పూల చెట్టును ఆన్ లైన్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.