అందమైన ఫ్యాబ్రిక్స్ తో మొదటి వరసలో కనిపిస్తుంది వెల్వెట్. పట్టులోని మెరుపు ఊలులో  మెత్తదనం రెండు కలిసి ఉంటాయి కనుక పూర్వం చలికాలంలో ఏదైనా ఫ్యాషన్ దుస్తులు ధరించాలి అనుకుంటే దీన్నే ముందు తలుచుకునేవాళ్ళు . మనీష్ మల్హోత్రా తరుణ్ తహలియాని వంటి టాప్ ఫ్యాషన్ డిజైనర్లు ఈ అందమైన ఫ్యాబ్రిక్ తోనే  చీరలు బ్లౌజులు లెహెంగాలు లంగా ఓణీలు అనార్కలీ బంద్గాలాలు  డిజైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లకు సరికొత్త అందాన్ని ఇస్తున్నారు. ఖరీదు ఎక్కువైనా బరువుగా అనిపించినా నెట్ జార్జెట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో కలిపి ఏ వేడుక కైనా సరిపోయేలా డిజైనర్ దుస్తుల్ని రూపొందిస్తున్నారు. మెరిసే జరీ జర్దోసీ వర్కులు. పట్టు దారాల  ఎంబ్రాయిడరీ లు వెండి రంగులు మెరిసే గోటా బోర్డార్లు ఇలా ఏవేన్నా ముదురు రంగు వెల్వెట్ పైన మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సుతిమెత్తని వెల్వెట్ తో బ్రొకేడ్ డిజైన్ తో వచ్చే సిల్క్ వెల్వెట్ తేలికగా వుండే షిఫాన్ రకము క్రష్ డ్  హోమ్మేడ్  లయోన్  నాక్రే  ఇలా చాలా రకాలున్నాయి. రాత్రివేళ ఈ మఖముల్ డిజైనర్ దుస్తుల అందమే స్పెషల్.

Leave a comment