కొందరికి తలకట్టు పలచగా ఉంటుంది లేదా ముదురు దగ్గర వెంట్రుకలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇలా పలచబడిన స్కాల్ఫ్ ను హెయిర్ ఎక్స్ టెన్షన్స్ తో కప్పేసి అందమైన తలకట్టు తో వెలిగి పోవచ్చు. క్లిప్ ఆన్ ఎక్స్ టెన్షన్లు మధ్యలో పాపిడి అటుఇటు వెంట్రుకలు ఉంటాయి వీటిని జిగురుతో అంటిస్తారు. తరచుగా తల స్నానం చేయకపోతే కదలకుండా ఉంటాయి. ప్రతి రోజు స్నానం సమయంలో తల తడవకుండా క్యాప్ పెట్టుకోవాలి. అలాగే తల ఒత్తుగా కనిపించాలి అంటే టేప్ ఇన్ ఎక్స్ టెన్షన్లు అత్యంత నాణ్యమైన రెమీ హెయిర్ ఎక్స్ టెన్షన్ లు సహజమైన వెంట్రుకలు మాదిరే ఉంటాయి. అంటించిన ప్యాచ్ లో చర్మంతో కలిసిపోయి ఉంటాయి కనుక ఈ ఎక్స్ టెన్షన్ లతో ఎలాటి హెయిర్ స్టైల్ అయినా ప్రయత్నం చేయవచ్చు.

Leave a comment