Categories
తియ్యగా ఉండే ఈ పండు నోటికి రుచిగా ఉండటమే కాదు అందానికి సహకరిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దానిమ్మ అత్యంత శక్తిమంతంగా మృతకణాలను తొలగించగలుగుతుంది. ఈ పండు తో చర్మం మెరుపు తీసుకురావచ్చు దానిమ్మ తొక్క చక్కని స్క్రబ్బర్ ఈ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి నిమ్మరసం తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే దానిమ్మ రసం లో పెరుగు కలిపి మొహానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దానిమ్మ రసంలో నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి కాసేపు ఆగి కడిగేస్తే చాలు ఫ్రెష్ గా కనిపిస్తుంది.పిగ్మెంటేషన్ కు కూడా దానిమ్మ రసం మంచి ఫలితం ఇస్తుంది.