Categories
Soyagam

అందానికి ఫ్రూట్ తెరెపీ

పళ్ళ ప్రయోజనాలు అనంతంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పండ్లను కేవలం ఆరోగ్యానికి సంబంధించే కాకుండా సౌందర్య పరిరక్షణలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సౌందర్య సాధనాలు చేయలేని పని ఒక పండు చేస్తుంది. అవకాడో ఫ్రూట్ ఇప్పుడు మనదేశంలోను ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఇది తినే పండుగా కంటే మంచి సౌందర్య సాధనం. అవకాడో గుజ్జును చర్మానికి అప్ప్లయ్ చేసి మసాజ్ చేస్తే పొడి చర్మం తేమగా అవటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు మటుమాయo అవుతాయి. ముఖానికి అంతకుముందు లేని సున్నితత్వం, మృదుత్వం వస్తుంది. ఈ పండులోని నైరోలిన్ అనే పదార్ధం వృద్ధాప్య ఛాయలను సమర్ధంగా ఎదుర్కొంటుంది. అవకాడో లిప్ బామ్ తో పెదవులు మెరిసిపోతాయి. అలాగే పీచ్ పండ్లు కూడా. వీటి తొక్కను తీసి పండు గుజ్జు ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో కడిగేస్తే చాలు. ముఖంపైన మచ్చలు ముడతలు పోతాయి. వారానికి రెండు సార్లు పీచ్ పండ్లు గుజ్జును మొహంపైన రాసుకుని అరగంట పాటు ఆరనిచ్చి చూస్తే ఫలితం తెలుస్తుంది.

Leave a comment