Categories
టీనేజ్ లో ముఖ్యంగా వేధించేవి మొటిమలు . మందులు ,ఆయింట్ మెంట్స్ కంటే వేపాకు బాగా పనిచేస్తుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . ఈ ఆకుల్లో ఔషధ గుణాలు,యాంటీ బాక్టీరియల్ గుణాలు రెండు ఉంటాయి . వీటిలో ఉండే విటమిన్ -ఇ ఫ్యాటీ ఆమ్లాలు పొడి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి . వేపాకుని నీటిలో మరిగించి ,ఆ నీటిని చల్లార్చి వడకట్టాలి . అన్నిటిలో గంధం పొడి కలిపి మొహానికి మెడకు పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి . ఈ మాస్క్ తో మొటిమలు తగ్గి ,నెమ్మదిగా మొటిమలవల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి . మొహం మెరుపుతో ఉంటుంది . వేపాకుమరిగించిన నీళ్ళలో మెత్తగా ఉడికించిన ఓట్స్ కలిపి మాస్క్ వేసిన ఇదే ఫలితం ఉంటుంది . అలాగే వేపాకుమరిగించిన నీళ్ళలో పసుపు కొబ్బరి నూనె కలిపి మొహానికి మాస్క్ వేస్తే ముఖం పైన నలుపు ,మచ్చలు పోయి మొహం మెరుపుతో ఉంటుంది .