Categories
ముఖాకృతి లో పెదవులు చాలా అందమైనవి. చక్కని పల్లువరుస తో, ఎర్రని పెదవులతో మొహం వజ్రాల నగలు ధరించినంతగా మెరిసిపోతుంది. కళ్ళ కింద లాగే పెదవుల్లోను ఆయిల్ గ్లాండ్స్ వుండవు కనుక తొందరగా పొడి బారి పోయి పగుళ్ళు వచ్చేస్తున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పులు కనిపించేది పెదవుల చుట్టూనే. నలభైల తర్వాత పెదవుల చుట్టూ చర్మం పై వృద్దాప్య లక్షణాలు కనిపిస్తాయి. కనుక ప్రతి రోజు తప్పని సరిగా పెదవులను మాయిశ్చురైజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఫేషియల్ స్క్రబ్ తో పెదవుల పైన రుద్దితే మృత కాణాలు పోతాయి. తర్వాత పెదవుల పై కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ రాస్తే సరిపోతుంది. ఎక్కువగా పొడిబారి పగిలిపోతూ వుంటే లిప్ బామ్ అప్లయ్ చేయాలి. పెదవులతో తడి చేస్తే మరింత పొడిబారి పోతాయి.