నీహారికా,
ఈ కాలపు అమ్మాయిలు సెల్ఫ్ హీలింగ్ గురించి కష్ట ఆలోచిస్తే బావుండు అనిపిస్తుంది. జీవితానికి చాలా అవసరమైన ముఖ్యమైన్ సూత్రం ఇది. జీవితం పట్ల, మన పట్ల మనకు వుండే విశ్వాసం ఈ సెల్ఫ్ హీలింగ్ కు దారి తీస్తుంది. నమ్మకం అనేది ఒక శక్తి. మనం నమ్మే చాలా విస్వాసాలు మన రక్తం లోంచే వస్తాయి. మనకు చాలా వస్తువులు పడవు అనుకుంటాము. ఈ విషయాన్ని పదే పడే మనస్సుకి చెప్పుకుంటే మన డి ఎన్ ఏ దీన్ని బలపరుస్తుంది. అంటే నమ్మకాలు మానంలో మనం నాటుకునే విత్తనాలన్నమాట. ఆలోచనలను నమ్మకాలను సరిగ్గా మలుచుకోగలగడం ఈ సెల్ఫ్ హీలింగ్. మన మనస్సులో ఏదైనా చేయగలను అని నమ్మకం పెట్టుకుని దానికి కట్టుబడి వున్న మనకు ఆ నమ్మకం మన చేత ఆ పనిని చేయిస్తుంది. ఆనమ్మకం ఎలాంటి కష్టాలనైనా అవరోధాలనైనా ఎదుర్కునేందుకు సహకరిస్తుంది. ఇదే విధంగా ప్రతి మనిషికి సెల్ఫ్ హీలింగ్ సాధ్యమే. అమ్మైలు మేము ధైర్యంగా, ఆత్మవిశ్వాసం తో జీవిస్తాం, ఎలాంటి సమస్యలకు కాలు వెనక్కి వేయమని సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలిగితే ప్రపంచాన్ని జయించినట్లే!