ఒకేఒక్క బిడ్డ వుంటే గారాబంతో చెడి పోతారని అంటూ వుంటారు కానీ ఆ ఆలోచనే తప్పంటారు చైల్డ్  సైకాలజిస్టులు. ఇంట్లో ఒక్క బిడ్డే వుంటే తల్లిదండ్రుల ఫోకస్ ఎటెన్షన్ వాళ్ళపై చాలా ఎక్కువగా వుంటుంది. తల్లిదండ్రులు మధ్యతరగతి వారైనా, చిన్ని ఉద్యోగులైనా వాళ్ళను మంచి చదువులు మంచి ఆహారం ఇవ్వడం, ఆరోగ్యంగా పెంచటం సాధ్యం అవ్వుతుంది. అలాగే పిల్లలకు డబ్బుతో ఇవ్వగలిగే అవకాశాలు కుడా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ డబ్బు విలువ నేర్పడం లో తల్లిదండ్రులు కీలక పాత్ర తీసుకోవాలి. పిల్లల్ని అతిగా గారాబం చేయకుండా పద్దతిగా పెంచితే, పిల్లల మానసిక ఆరోగ్యం బావుంటుంది. చిన్నతనం నుంచి షేరింగ్ ధోరణి లో పెంచితే స్వార్ధ పూరితమైన ఆలోచనలు రాకుండా వుంటుంది.

Leave a comment