Categories
కసావు అనేది కేరళ లో పురాతన చేనేత పద్ధతి. ఆ పేరుతోనే కసావు చీరలు వచ్చాయి. అతి సున్నితమైన బంగారు వెండి దారాలతో అంచు నేస్తారు.కేరళలో ల్యూగ్ సాధించిన మొట్టమొదటి చేనేత కళ ఇది. ట్రావెన్‌కోర్ రాజ వంశీయుల కాలంలో కసావు చీరలు ప్రాచుర్యంలోకి వచ్చాయి కేరళలోని బలరామపురం,చెంద మంగళం కుతంపుల్లి గ్రామాల్లో ఈ చేనేత చీరలు నేస్తారు. బ్లీచింగ్, డయింగ్ లేని ఈ చీరలు ఒక్క కేరళలోనే కాదు దేశ విదేశాల్లో అమ్ముడు అవుతున్నాయి. ఈ ఐవరీ కలర్ కాటన్ వస్త్రాలపై అందాల డిజైన్ లు అమ్మాయిలకు ఎంతగానో నచ్చుతున్నాయి.