Categories
హైదరాబాద్ లోని ముస్లిమ్ మెటర్నిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ 53 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.ఇందులో ప్రత్యేకత హాస్పిటల్ సి ఈ ఓ నుంచి సెక్రెటరీ సెక్యూరిటీ స్టాఫ్ వరకు అందరూ మహిళలే. 200 పడకల హాస్పిటల్ లో కులం,మతం తేడా ఉండదు.మహిళలందరికీ వైద్య సేవలు అందుతాయి. ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించిన మూడు స్కూళ్ళు, మూడు హాస్పిటల్స్ లో ఇది ఒకటి. మహిళల ఆసుపత్రి గా పిలిచే ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.ఇది టీచింగ్ హాస్పిటల్. వరంగల్ కె ఎన్ ఆర్ యూనివర్సిటీ లతో అనుసంధానమై ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా ఇందులోనే ఉంటుంది.