చీరకట్టు లో వున్న అందం తంటా ఇంతా కాదు. సాధారణంగా సన్నగా వుంటే చీరలు అందం ఇస్తాయి అంటారు. కాటన్ చీరలు అందరికీ బావుండవు, పెద్దవాళ్ళలా కనిపిస్తారు అనుకుంటారు. అసలు చేనేత చీరలు ఎవరికైనా ఎప్పుదైనా హుందాతనాన్ని తెచ్చిపెడతాయి. ప్రేత్యేకంగా కనిపించాలంటే బ్లాక్ అండ్ వైట్ మంచి కాంబినేషన్. తెల్లని నల్లంచు చీర ఎప్పుడూ అందమే. ఇక కంచి చీరలు ఎంత గ్రాండ్ లుక్ ఇస్తాయో చూస్తూనే ఉన్నాం. పెద్ద అంచులున్న సాదా చీరకు సెల్ఫ్ బ్లవుజ్ వేసుకుంటే ఒక పండగ, ప్రత్యేక సందర్భం అని వేరేచెప్పనక్కరలేదు. ఇక బెనారస్, ప్లెయిన్ జరీ అంచుల చీరలు ఏ వయస్సు కయినా అందాన్ని పదింతలు చేసేవే. అందుకే వస్త్రశ్రేని ఏదయినా చీర అందం చీరదే.

Leave a comment