అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా…..
మా మనవి ఆలించి పాలించవమ్మా!!

ఈ రోజు లలితా దేవి మనకు అన్నపూర్ణ దేవి అవతారం లో దర్శనం ఇస్తుంది.సాక్షాత్తూ  జగతిని అఙ్ఞాపించే స్వరూపుడైన శివునికి అన్నపూర్ణ దేవి అవతారంలో ఉద్భవించి అన్నం పెట్టిన జగజ్జనని.
ఈ రోజు ఆకాశ రంగు వస్త్రధారణ,ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టిన ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.కుంకుమార్చన,అన్నపూర్ణాష్టకం పఠనం చేసిన చాలా మంచిది. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ చెయ్యాలి. ముతైదువులకి రవిక, పసుపు,కుంకుమ,గాజులు,తాంబూలం వాయినం ఇచ్చిన సకల సౌభాగ్యాలతో తులతూగుతాము.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పెరుగన్నం,కట్ పోంగల్.

            -తోలేటి వెంకట శిరీష

Leave a comment