ఎదురుగుండా నిలువెత్తున కనిపిస్తున్నా మనం గుర్తించని పోషకాలున్నఆకు మునగాకు. పప్పులో కూరల్లో,పులుసుల్లో మిగతా ఆకు కూరల్లో కూడా వాడుకోవచ్చు. పొడిగా ఎండ బెట్టినా ఏ మాత్రం పోషక విలువలు పోవు. ఇదేంత అద్భుతమైందంటే క్యారెట్లలో కన్నా ఎక్కువ విటమిన్ ఏ , పాలల్లో కన్న ఎక్కువ కాల్షియం, పాలకూర కన్నా ఎక్కువ ఐరన్, నారింజ కన్న ఎక్కువ విటమిన్ సీ,అరటి పండ్ల కన్నా ఎక్కువ పొటాషియం వుంటుంది. దిన్నీ పెసరపప్పులో కలిపి వండితే ఇందులోని ఐరన్ శరీరానికి ఎక్కువ ఉపయోగపడుతుందని డాక్టర్లు చెపుతారు. శరీరంలో ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మునగాకులో ఉండే యాంటీ అక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Leave a comment