మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం కోసం పరుగులు తీస్తూనే ఉండాలి. అందుకు తగ్గట్లే దుస్తులు అలంకరణ వస్తువులు క్షనాణికో ఫ్యాషన్ ట్రెండ్ లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. డ్రెస్ కి మ్యాచయ్యే గోళ రంగు వేసుకోవాలి అనుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ కలరే పెదవుల పైకి రావాలంటే ! ఇదిగో క్షణాల్లో దిగుమతి అయిపోయింది. మ్యాచింగ్ వెతుక్కునే పని లేకుండా ఒకే షేడ్ లో వుండే లిప్ స్టిక్ ,నెయిల్ పాలిష్ తయారు చేసారు కొన్ని సంస్థలు. ఇక అమ్మాయిలు సంతోషించరా ? డ్రెస్ కి యాక్సెసరీస్ మ్యాచింగ్ అలాగే లిప్ స్టిక్ కి నెయిల్ పాలిష్ కి మ్యాచింగ్. మొత్తంగా ఫుల్ మ్యాచింగ్!

Leave a comment