Categories
ఎక్కువ పని చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అనారోగ్యం బారిన పడతారు అంటున్నారు అధ్యయనకారులు. సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగినుల పైనా దీర్ఘకాలం చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం వారం లో 45 గంటలకన్నా ఎక్కువ పని చేస్తే వారిలో గుండె జబ్బులు,ఊబకాయం,రక్తపోటు,షుగర్ కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో పాటు రక్త హీనత కూడా ఎక్కువగా ఉందని కనిపెట్టారు. స్త్రీ లు ఇంట బయటా పని చేస్తూ సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ఇలాటి అనారోగ్యాల బారిన పడ్డారని తేలింది. ఎన్నో పనిగంటలు విశ్రాంతి లేని పని చేయటం వల్ల ఎన్నో టెన్షన్లు అలసట తోనే ఈ అనారోగ్యాలు వచ్చాయని అధ్యయనం లో పాల్గొన్న డాక్టర్లు తేల్చి చెప్పారు .