ఆదివారం వస్తే చాలు ఆడవాళ్లు అంతులేని పని పెట్టుకుర్చుంటారు.. ఇక జాబ్ చేస్తున్నవాళ్ళైతే ఇంటి శుభ్రత ఉతకటాలు మిగతా రోజుల్లో తీరుబడి కాక ఆ ఏఒక్క సెలవునీ సెలబ్రేట్ చేసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . ఆదివారం నాడు పేరుకో బోతున్న పనుల్ని వర్కింగ్ డేస్ లో సాధ్యమైనంత వరకు పూర్తీ చేసుకుని ఆదివారం విశ్రాంతిని వదులుకోవద్దంటున్నారు. సర్దే పనులు అస్సలు పెట్టుకోకుండా కొన్ని తీరుబడిగా చేయవలిసిన పనులకు కేటాయించుకోవాలి. ఆ వారం మొత్తం వేసుకోబోయే దుస్తుల్ని సెట్లుగా పెట్టుకోవటం చదవాల్సిన పేపర్లు పత్రికలు కెరీర్ కోసం తెలుసుకోవాలిసిన విషయాలు లాంటిదే ఓ నాలుగైదు గంటల్లో ముగించుకుని మిగతా సమయం విశ్రాంతి తోనే గడపాలి. టీవీ కంప్యూటర్ ఫోన్లు కాస్సేపు అవతల పెట్టేసి కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించమంటున్నారు. ఇంట్లో అందరు కలిసి ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్లి రావటం తీరుబడిగా తినదల్చుకున్న భోజనం చేయటం ఇంకా ఆ రోజుతో పని రోజుల్లో చేసిన శ్రమంతా పోవాలని నిర్ణయించుకోవాలంటున్నారు. ఈ ఆదివారం ప్రణాళిక తో ఇటు రెస్టు సోమవారం ఉదయం కోసం కాస్త ఫ్రెష్ నెస్ దక్కుతాయి.
Categories