Categories
మా బామ్మ చర్మం జుట్టు ఇప్పటికీ ఆరోగ్యంగా కనిపిస్తాయి. పసుపు, చందనం, శనగపిండి, నిమ్మకాయ, ఉసిరి, మెంతులు, మందార సహజ ఉత్పత్తులే వాడుతోంది. ఆ సౌందర్య చిట్కాలు అందరికీ పరిచయం చేయాలని భూమిత్ర ఆన్ లైన్ స్టోర్ లోకి అడుగు పెట్టాను అంటుంది కీర్తి సురేష్. ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి ఈమె ప్రారంభించిన ఆన్ లైన్ స్టోర్ లో చర్మ, కేశ సంరక్షణ ఉత్పత్తులు దొరుకుతాయి. చర్మానికి ప్రస్తుతం అపకారం చేయని, ఎలాంటి రసాయనాలు లేని ఉత్పత్తులు అందించాలన్నదే ‘భూమిత్ర’ లక్ష్యం అంటూ చెబుతోంది కీర్తి సురేష్.