Categories
మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ ప్రోటీన్ పదార్ధం అవిసె గింజలు. ఫిట్నెస్ కోరుకునే వారి ఆహారంలో అత్యవసర పదార్ధంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అవిసె. ఆహారం , వైద్యం , సౌందర్యం వంటి అనేక అంశాలకు సంబంధించీ ఫ్లేక్ సీడ్స్ ఎంతో ఉపయోగకరం అని తాజా అధ్యాయనాలు చెప్పుతున్నాయి. అవిసె మొక్కలో ప్రతి భాగమూ ఉపయోగకారమే.ఇందులో కండ నుంచి పీచు తయ్యారు చేస్తారు. పువ్వులో ఔషధ గుణాల , గింజలు తినేందుకు , ప్రాధమిక అవసరాలకు ఉపయోగిస్తారు. వేయించిన గింజలు యధాతధంగా తినొచ్చు. సలాడ్స్ , సూప్స్ , స్మూతీస్ , బ్రేడ్స్ , కేక్స్ , కుకీస్ తయారీలో కూరల తయారీ లో వాడుకోవచ్చు. హార్మోన్ స్ధాయి రక్షణ లో కీలక స్ధాయి వహిస్తుంది. కాబట్టి ఇవి మహిళలకు పనికి వచ్చే ఆహారం.