Categories
ఫోర్బ్స్ ప్రతిభావంతుల జాబితా లో రియా మిర్చందాని పేరు చోటు చేసుకుంది. ఈ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ తో సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ పే కి దేశంలో ప్రోడక్ట్ లీడ్ గా పనిచేస్తున్న ఈమె తన ఆలోచన వ్యూహాలతో ఏడాదిలోనే దాని వినియోగదారుల సంఖ్య 13 రెట్లు పెంచింది. టస్సెల్ లోన్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కమేడియన్ స్టాండప్ కమెడియన్ విశ్వవిద్యాలయాల్లో ఇన్స్ట్రక్టర్, మెంటార్, టూర్ గైడ్ వంటి ఎన్నో ప్రత్యేకతలున్న రియా వయసు 28 ఏళ్లు మాత్రమే.