Categories
ఒక తాజా పరిశోధన మగవారి లో కంటే ఆడవారి లోనే మెడనొప్పి,నడుము నొప్పులు ఎక్కువ అని తేల్చింది నొప్పి కలిగే విషయంలో స్త్రీ పురుషుల నడమ ఎంతో వ్యత్యాసం ఉంటుందనీ మగ వారి కంటే స్త్రీ లే నడుము,మెడ నొప్పులతో బాధ పడుతుంటారని కొన్ని వేల మంది పైజరిగిన పరిశోధనలో గుర్తించారు. ఇంటా ,బయటా కూడా స్త్రీలు ఎంతో వత్తడి ఎదురుక్కొంటు ఎక్కువ పనులు చేయటమే ఇందుకు కారణం అని పరిశోధకులు చెప్పారు. పైగా మగవారు చాలా త్వరగా నొప్పి నివారణ చర్యలు చేపడతారని ఆడవాళ్ళు నొప్పుల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ,అవి ప్రమాదకరంగా పరిణమించే వరకు పట్టించుకోరని పరిశోధకులు స్పష్టం చేశారు.