యువ ఐ.ఏ.ఎస్ అధికారిణి అమ్రపాలి మరో అరుదైన అవకాశం దక్కించుకొన్నారు . ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్ 27వరకు కొనసాగనున్నారు. 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు.ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.