నీహారిక,
సాధారనంగా పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడ తాము, నలుగురి ముందు వాళ్ళను దండిస్తే వాళ్ళు బాధ పడతారని కున్గిపోతారను అనుకుంటాం కానీ, వాళ్ళ పైన అంతులేని అంచనాలు మోపితే కుడా కుడా కున్గిపోతారని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నువ్వు తప్పని సరిగా కాలేజి ఫస్ట్ రావాలి అని తల్లిదండ్రులు చెప్పుతూ వచ్చినా సరే, ఆ అంచనా అందుకోలేక పిల్లలు మనో వేదన చెండుతారట. ఈ కుంగి పోవడం ఎంత దూరంగా వేలుతుందంటే ఇక పూర్తిగా ఒంటరిగా ఎవరి తోనూ కలవ లేనంత నిరస లో కురుకుపోతారు. ప్రపంచంలో అందరు బావుంటారు నేను టాప్ప అన్నంత దిగులు గా అయిపోతారు. అందుకే ఇతరులతో పోలిక తెచ్చుకుని మనం పిల్లల్ని మనమే ఇబ్బంది పెట్టకూడదని అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఎవరో, ఎక్కడో కోటి రూపాయిలు లాటరీ సంపాదిస్తే,అలాంటి లాటరీ మనకు రాలేదని దిగులు పెట్టుకున్నట్లే వుంటుందీ వ్యవహారం. వందలో ఒక కుర్రవాడు ఒక కంపెనీ సి. ఇ. ఓ ఐపోతే, ఇక అతని లాగా మనం పిల్లాడు అంత ఎత్తు ఎక్కాలని మనం ఆశిస్తే తప్పే కదా. మన పిల్లల్లో వుండే సామధ్యం పట్టించుకోకుండా ఎక్కడో లేని విషయాన్ని వాళ్ళ పై భారం మోపుతున్నాం. ఇలా పొరపాట్లు చేయకండి. పిల్లల్ని సమస్యల పాలు చేయకండి అంటున్నాయి అద్యాయినాలు.