క్యారెట్లు తింటే కంటి చూపు మెరుగవుతుంది అని ఊరికే ఎక్కువ క్యారెట్లు తినకండి.  అది అంతా అబద్ధం అవసరానికి మించి క్యారెట్లు తింటే అనర్థం అంటున్నారు అధ్యయనకారులు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిషర్లు రాత్రివేళ జర్మనీ యుద్ధ విమానాలు కాల్చేందుకు ఒక టెక్నాలజీ కనుగొన్నారు ఆ రహస్యం దాచటం కోసం తమ పైలెట్లు క్యారెట్లు తినటం వల్లనే చీకట్లో జర్మన్ విమానాలను కూల్చ గలగుతున్నారని ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్ల క్యారెట్లు తింటే కళ్ళు బాగా ఉంటాయనే అపోహ కలిగింది. నిజానికి క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్-ఎ గా మార్చుకుంటుంది కాబట్టి విటమిన్ ఎ తో కంటి చూపు మేలు కలుగుతుంది కానీ మెరుగు పడే అవకాశం లేదన్నారు అధ్యయనకారులు.

Leave a comment