అపుడెప్పటివో పాతనగలు మళ్ళీ ఫ్యాషన్ పోకడలో భాగంగా మారి యాంటిక్ నగల పేరుతో అమ్మాయిలు మనసు దోచుకొంటున్నాయి . ఈ యాంటిక్ నగలకు భారీ మెరుపులుండవు . చక్కని పనితనంతో ఫినిషింగ్ తో ఉంటాయి . పాత నగలు చూస్తుంటే బంగారు ఆభరణాలు లా మరీ ధగధగలాడవు . వన్నె తక్కువగా ఉన్నా చాలా అందంగా ఉంటాయి . పాత నగలలో గోల్కొండ గనుల్లోని విలువైన అన్ కట్ రాళ్ళు పొదిగి చక్కని నగిషీలతో ఉండే ఆభరణాలకు ఇప్పటికి గిరాకీ పెరిగింది . అలనాటి నగల్లో వుండే కెంపులు చాలా విలువైనవి కూడా . తమిళనాడుకు చెందిన గుండ్రని పతకాల పెండెంట్లు చక్కని ముస్లీo,నిజాం కాలం నాటి చేపల ఆకృతుల చెవి పోగులు, అర్ద చంద్రాకారం పెండెంట్లు ,దేవతా మూర్తుల చెవిపోగులు ఇవన్నీ ఇన్నేళ్ల ప్యాషన్ జ్యువెలరీగా చెప్పచ్చు . యాంటిక్ ఆభరణాలు సమకాలీన పోకడలకు ఏమాత్రం తీసిపోవు
Categories