Categories
రెండు రోజులు వరసగా వర్షం పడితే అంతా బురదై పోయి ఏ పని తోచకుండా వుంటుంది. కానీ ఏడాది పొడవునా వర్షాలు పడే ప్రాంతాలున్నాయి. మొదట్లో అత్యధిక వర్ష పాతం గల ప్రాంతం చిరపుంజి అనేవాళ్ళు. ఇప్పుడా స్థానంలోకి మాసిన్రామ్ వచ్చింది. మేఘాలయాలోని ఖాసి కొండ ప్రాంతంలో ఈ రెండు ఉంటాయి పూర్తిగా ఆరు నెలలు వర్షం ముంచెత్తుతూ ఉంటుంది. కానీ ఇవి పచ్చదనంతో కళకళలాడే ప్రాంతాలు ఇక్కడ వంతెనలు కూడా పెరిగిన చెట్లు ఊడలతో సహజంగా మలచి నిర్మిస్తారు రోజుల తరబడి సూర్యుడు కనిపించడు వర్షాలకు ఇళ్ళు వాకిళ్ళు దెబ్బతింటూ వుంటాయి. టార్పాలిన్ పట్టాలు, గడ్డి కప్పి ఇళ్ళు కాపాడుకుంటారు. నిత్యం వర్షం ఉన్న వాళ్ళు దినచర్య యదాప్రకారం నడుస్తూనే ఉంటుంది.