మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించింది బెంగళూరుకు చెందిన మహిమ నాగరాజ్. కోవిడ్-19 కలవర పెడుతున్న వేళలో వృద్దులను ఇంటి నుంచి బయటకు రావద్దనీ ఆ వయసులో వైరస్ సోకితే కోలుకోవడం కష్టం అంటున్నారు వైద్యులు. ఆలా బయటికి రాలేని వృద్దుల కోసం కేర్ మాంగర్స్ ఇండియా పేరుతొ ఫేస్ బుక్ పేజీ తెరిచింది మహిమ. 24 గంటల్లో ఆ గ్రూప్ లో 200 మంది వాలంటీర్లుగా చేరారు. ఇప్పుడు మూడు వేల వరకు వాలంటీర్లు వస్తువులను నేరుగా చేతికి ఇవ్వకుండా ఇంటి గుమ్మం ముందరో,లేదా అపార్ట్ మెంట్ వాచ్ మెన్ దగ్గరో పెట్టి వెళ్ళిపోతారు వాలంటీర్లు . ఈ సాయం అందిస్తున్న మహిమకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.