
బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ స్థాపించింది 34 సంవత్సరాల షాహిన్. స్వయంగా యాసిడ్ బాధితురాలు యాసిడ్ దాడిలో ఒక కన్ను పూర్తిగా పోయిందామెకు తన వంటి బాధితులు ఎంతో మంది ఉన్నారని తెలుసుకుని బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ ఎన్జీవోలు ప్రారంభించింది షాహిన్ అప్నా ఘర్ పేరిట ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా నడిపిస్తోంది. ఢిల్లీకి చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన షాహిన్ ఇప్పుడు యాసిడ్ అమ్మకాలు నిలిపివేయాలని పోరాటం చేస్తోంది. షాహిన్ స్థాపించిన ఫౌండేషన్ బాధితులకు నష్టపరిహారం, న్యాయ సలహా వైద్యసాయం లభిస్తాయి.