ఈ రోజుల్లో మొహాం ఎండకు వాడిపోతూ ఉంటుంది. తాజా కూరలు ,పండ్ల గుజ్జుతో చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదాహారణకు యాపిల్ లో చర్మానికి మేలు చేసే ఎ,సి విటమిన్లు ,రాగి వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇవి వయసును తగ్గించే సహజయాంటీ ఏజింగ్ కారకంలా పని చేస్తుంది.ముఖంపై మూడతలను తగ్గిస్తాయి. ఈ పోషకాలు మృతకణాలను నివారిస్తాయి. అన్ని రకాల చర్మ తత్వానికి మేలు చేయగలదు యాపిల్ గుజ్జులో రెండు స్పూన్ల కొబ్బరి నీళ్ళు నిమ్మ నూనె కలిపి ఈ గుజ్జును మొహంపై రాసి బాగా ఆరాక కడిగేస్తే చక్కని ఫలితం ఉంటుంది. పొడి చర్మం తత్వం అయితే నిమ్మనూనె కు బదులు నువ్వుల నూనె రాయవచ్చు. వట్టి టోమోటో రసం కూడా ఇదే రకమైన ఫలితం ఇస్తుంది.

Leave a comment