నీహారికా,
పిల్లలు పెరుగుతున్నా కొద్ది తమ తోటి పిల్లలను చూసి తమకు అలాంటి జీవన విధానం కావాలని, తమకూ ఖరీదైన వస్తువులు, దుస్తులు, పాకెట్ మనీ కావాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. వారు అలా అడుగుతుంటే సరే చూద్దాం అని అర్థం లేని హామీలు ఇచ్చి, వాళ్ళ పోరు పడలేక ఇచ్చి, అప్పులు పాలు అయ్యేకంటే కుటుంబ ఆర్ధిక పరిస్థితి, మనం పెట్ట గలిగే బడ్జెట్ గురించి ముందే చెప్పేస్తే మేలు. అయినా నా కిది కావాలని పేచి పెడితే, ఇదిగో ఇదినా సాలరీ ఇదే ఇతరంగా నాకు వచ్చే మంత్లీ ఇన్ కమ్. ఇందులో మనం సర్దుకొవాలి. చదువుకు ఖర్చయ్యేది, ఇంట్లో రెగ్యులర్ గా వాడుకొనే డబ్బుల మొత్తం లెక్కలు చూపించాలి. ఒక్క ఎర్ర పైసా కూడా అప్పు చేయనని మోహమాటం లేకుండా చెప్పేయ్యాలి. చదువు ముఖ్యం గనుక శ్రద్దగా చదువుకోమని ఒకవేళ ఖరీధైన జీవితం కావాలంటే తప్పని సరిగా పోటీ పరీక్షల్లో హాజరై కోరుకొనే జీతం సంపాదించుకొని అప్పుడు హాయిగా ఖర్చు చేసుకోమని స్పష్టంగా చెప్పాలి. ఇది ఒక్క రోజులో పరిష్కారం కాకపోయినా నెమ్మదిగా పిల్లలు అర్థం చేసుకొని స్తిమిత పడతారు. వాళ్ళకి కుటుంబ పరిస్తితులపై అవగాహన తేవాలి.