Categories
వేళకు తినండి ఎందుకు పెద్ద వాళ్ళు చెప్పారో గాని ఇప్పుడైతే అసలు ఆకలెస్తే కలిగే దుష్పరిణామాలలో ఒక పుస్తకం రాసేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలేస్తే కోపం వస్తుందట. ఇక రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోతాయట. ఒత్తిడి కలిగించే కార్డిసోల్ హార్మోన్ ఆడ్రినలిన్ విడుదల అవుతాయని ఈ హార్మోన్ల వల్ల మెదడుకు వత్తిడి కలిగి చిరాకు,కోపం,విసుగు మొదలైన అన్ని భావోద్వేగాలు కలుగుతాయి. పరిశోధకులు ఈ అవస్థకు హంగ్రీ,యాంగ్రీ కలిపి హ్యాంగ్రీ అని కూడా పేరు పెట్టారు. ఇన్ని కల్లోలాలు కడుపులో కదలకుండా వేళకి తింటే పోతాయంటున్నారు.