క్లే తో పిల్లలు బొమ్మలు చేసి ఆడుకుంటూ ఉంటారు. ఈ క్లే ఎన్నో రంగులలో దొరుకుతుంది. ఇప్పుడు ఫ్యాషన్ జ్యూలరీలోకి ఈ క్లే నగలు ప్రవేశించాయి. పాలిమర్ క్లేని అందమైన రంగుల్లో ఎంచుకుని అద్భుతమైన నగలు తయారు చేస్తున్నారు.అందమైన చిన్న గులాబీ పువ్వులతో అలంకరించిన క్లే నగలను చూస్తే చక్కగా ఏ మోడ్రన్ డ్రెస్ పైకి అయినా సూటవుతాయి.ముఖ్యంగా ఇవి చిన్న పిల్లల అలంకరణకు బావుంటాయి.చక్కని గాజులు ,లోలాకులు,గొలుసులు ఏదైనా క్రియోటివ్ గా చక్కగా ఉన్నాయి.ఇలా తయారు చేసుకోవాలంటే బోలెడన్ని విడియోలు యూ ట్యూబ్ లో చూడవచ్చు.

Leave a comment