స్వేటర్  కాని స్వేటర్ ఒకటుంది అదే ష్రగ్. స్వేటరు నడుము వరకు పొడుగ్గా ఉంటరే ష్రగ్ ఖాతా కిందభాగం వరకే ఉంటుంది. మొదట్లో ఉన్ని తో తయారు చేసిన ఈ ష్రగ్ ఇప్పుడు కాశ్మీరీ కాటన్ మిక్డ్ కాటన్ సింథటిక్ కాటన్ టోన్ కాకుండా షిఫాన్ జార్జెట్ లేస్ డెనిమ్ ష్రగ్స్ కూడా వస్తున్నాయి. వేసుకున్న డ్రెస్ కు కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. మోడ్రన్ డ్రెస్ లకు మ్యాచయ్యే కలర్డ్ ,క్రాఫ్ట్ ,టై అప్ ,ఫ్రిన్జ్  లాంటి రకాల్లో పొడవుగా ఉండేవి, కట్ స్లీవ్స్ కూడా ఉంటాయి. పటియాలా ,జోధ్ పురి , ప్యాంట్ల పైన వేసుకునే టాప్స్ కు పోల్కా డాట్స్ చేతి పని చేసిన ష్రగ్స్ బాగా మ్యాచ్ అవుతాయి. జీన్స్, చొక్కాలు, స్కర్ట లపైన క్రో షెట్  లేస్ తో అల్లిన ష్రగ్లున్నాయి. ప్రింటెడ్ డ్రెస్ లయితే ముదురు రంగు ష్రగ్స్ బావుంటాయి. చలి వణికిస్తోంది కాబట్టి ఈ ష్రగ్స్ పైన ఓ లుక్ వేయండి.

Leave a comment