Categories
అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి. ఇవి రెండు చెడు కొలెస్ట్రోల్ శాతం తగ్గించి మేలు చేసే కోలెస్ట్రోల్ స్థాయిని పెంచుతాయి. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల విటమిన్-ఇ లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల నొప్పుల్ని సమస్యల్ని తగ్గిస్తాయి. అవనూనెతో చేసిన పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకున్న త్వరగా పొట్ట నిండుతుంది. ఇందులో యాంటీ బాక్టిరియల్ గుణాలుంటాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రం చేసి ఆ పని తీరు మెరుగు పరుస్తాయి. వారానికో సారైనా ఈ అవనూనెను కూరల్లో వాడిటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు పొంద వచ్చు.