ఇల్లు ఎంతో శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది.కానీ ఎక్కడో ఒక మూల బాక్టీరియా చోటు చేసుకొంటుంది. వాటి వల్లనే చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి.స్మార్ట్ ఫోన్ లో,రిమోట్ కంట్రోల్స్ ,ట్యాబ్స్ లపైన బాక్టీరియా పేరుకు పోతూ ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఏ డెట్టాల్ ముంచిన గుడ్డతోనూ ఇవన్ని శుభ్రం చేయాలి. సంగీతం వింటూ ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఆ ఇయర్ ఫోన్ లని అలా వదిలేస్తూ ఉంటారు. చమట కారణంగా ఎంతో బాక్టీరియా పేరుకుపోతుంది.పైనుండే సిలికాన్ తొడుగుని శుభ్రం చేయాలి. తలుపులకు ఉండే హాండిల్ ,లిప్ట్ బటన్లు బాక్టిరీయాలు ఉండే ప్రాంతాలు. వాటి వల్లనే జలుబులు,జ్వరాలు వ్యాపిస్తాయి. వంటింటి గట్టును తుడిచే స్పాంజ్ లో లెక్క లేనన్ని క్రిములుంటాయి. వారానికి ఒక సారైనా బ్లీచింగ్ కలిపిన నీళ్ళలో వేసి స్సాంజ్ ని శుభ్రం చేయాలి.

Leave a comment